Fabtech technology: ప్రారంభంలోనే అదరగొట్టిన ఫాబ్టెక్ టెక్నాలజీ..! 4 h ago
ఫాబ్టెక్ టెక్నాలజీస్ షేర్లు శుక్రవారం స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. భారీ ఎత్తున బిడ్లు దాఖలై కంపెనీ షేర్లు ప్రారంభంలోనే అదరగొట్టాయి. 90 శాతం ప్రీమియంతో దళాలు స్ట్రీట్ లో ఎంట్రీ అయ్యాయి. ఇష్యూ రూ. 85 తో పోలిస్తే బీఎస్ఈలో రూ.161.50 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది.ఎస్ఎంఈ విభాగంలో వచ్చిన ఐపీఓ సబ్స్క్రిప్షన్లలో అత్యంత ఆదరణ పొందింది, ముఖ్యంగా చివరిరోజు 700 రెట్లు ఓవర్ సబ్స్క్రిప్షన్ నమోదైంది. కంపెనీ రూ. 27.74 కోట్లను సమీకరించాలనే ఉద్దేశంతో పబ్లిక్ ఇష్యూకు వచ్చింది, ఇందులో భాగంగా ఒక్కో షేరు ధర రూ. 80-85గా ప్రకటించబడింది. ఐపీఓలో భాగంగా 32.64 లక్షల షేర్లను జారీ చేసింది. ముంబయికి సంబందించిన ఈ కంపెనీ ఫార్మాస్యూటికల్, హెల్త్‌కేర్, బయోటెక్ రంగాల కోసం ప్రీ-ఇంజనీర్డ్, ప్రీ-ఫ్యాబ్రికేటెడ్ మాడ్యులర్ ప్యానళ్లు తయారుచేస్తుంది.